దమ్ముంటే జడ్పీ ఎన్నికలు పెట్టాలి

జనవరి 5(జనం సాక్షి)దమ్ముంటే జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాలు విసిరారు. అప్పుడే కేసీఆర్ పాలన బాగుందో, రేవంత్ పాలన బాగుందో తేలిపోతుందని స్పష్టం చేశారు.
రేపు జనగామలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పెంబర్తి నుంచి జనగామ చౌరస్తా మీదుగా సూర్యాపేట రోడ్డులోని భ్రమరాంబ కన్వెన్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లతో కేటీఆర్ ఆత్మీయ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏర్పాట్లను సోమవారం నాడు ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 50 శాతానికిపైగా సర్పంచ్‌లను గెలుచుకున్నామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల డైవర్షన్ కోసమే కేసీఆర్, హరీశ్‌రావుపై విమర్శలు చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు.


