తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ పాలసీ

` 2047కు మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానవిూగా రాష్ట్రం ఎదగడమే లక్ష్యం
` రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అభివృద్ధి బాట పట్టించడమే ధ్యేయం మహిళా సంఘాలను కార్పోరేట్‌ సంస్థలుగా తీర్చిదిద్దుతున్నాం
` తెలంగాణ రైజింగ్‌ 2047 ఎయిమ్స్‌ ఆబ్జెక్ట్స్‌ అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ పాలసీని అనుసరిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.` 2047కు మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానవిూగా రాష్ట్రం ఎదగడమే లక్ష్యమని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అభివృద్ధి బాట పట్టించడమే ధ్యేయం మహిళా సంఘాలను కార్పోరేట్‌ సంస్థలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.తెలంగాణ రైజింగ్‌ 2047 ఎయిమ్స్‌ ఆబ్జెక్ట్స్‌ అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. చారిత్రాత్మకంగా, 1991 నుండి ప్రతి దశాబ్దంలో మన ప్రాంతం యొక్క స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి రెట్టింపు అయింది. ఈ రోజు మనం 200 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము. కానీ తనను వెంటాడుతున్న, ఈ సభలోని ప్రతి సభ్యుడిని వెంటాడాల్సిన ప్రశ్న ఏమిటంటే? తర్వాత ఏమి జరుగుతుంది?మనం ఏవిూ చేయకపోతే ..మనం ‘‘యథావిధిగా’’ కొనసాగితే?2047 నాటికి మనం సహజంగానే 1.2 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అది గౌరవప్రదంగానే అనిపిస్తుంది. కానీ ఈ రాష్ట్రంలోని ప్రతి రైతును, ప్రతి దళితుడిని, ప్రతి గిరిజనుడిని మరియు ప్రతి మహిళను అభివృద్ధిలోకి తీసుకురావడానికి అది సరిపోదు అన్నారు.ఆ 1.2 ట్రిలియన్‌ డాలర్ల సహజ వృద్ధికి మరియు మనం ఆశించే 3 ట్రిలియన్‌ డాలర్ల గమ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి, మనకు గతం నుండి ఒక నిర్మాణాత్మక విరామం అవసరం అన్నారు. ఈ పేపర్‌ ఆ విరామం యొక్క విధానాలను వివరిస్తుంది అని తెలిపారు. ఈ దార్శనికత వ్యక్తిగత వృద్ధి నమూనా యొక్క కఠినమైన సూత్రాలపై ఆధారపడి ఉంది, ఈ లక్ష్యాన్ని సాధించడానికి, మనం కేవలం ఎక్కువ మంది కార్మికులను చేర్చితే సరిపోదని ఇది చెబుతుంది అని వివరించారు. మనకు ఒక ‘‘ఉత్పాదకత షాక్‌’’ అవసరం, మేము మాకు ఒక కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము, మా పెట్టుబడి రేటును ఉూఆఖలో 52%కి పెంచడం. దీని కోసం మనం మూలధనాన్ని నియంత్రించే రాష్ట్రం నుండి దానిని ఉత్ప్రేరకపరిచే రాష్ట్రంగా మారాలి అని తెలిపారు. దేశీయ పొదుపులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు మొదటిసారిగా, మా స్టార్టప్‌ల కోసం ఆవిష్కరణలలోని నష్టాన్ని తగ్గించడానికి ఒక ప్రత్యేక ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ మిశ్రమం ద్వారా మేము దీనిని సవిూకరిస్తున్నాము అని డిప్యూటీ సీఎం వివరించారు. క్యూర్‌ ` ప్యూర్‌ ` రేర్‌: చాలా కాలంగా, భారతదేశంలో అభివృద్ధి అంటే ‘‘నిర్లక్ష్య సముద్రంలో శ్రేష్ఠత ద్వీపాలు’’ అని అర్థం. హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతుండగా, మారుమూల జిల్లాలు పైనుండి కిందకు వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురుచూడటం మనం చూస్తున్నాము. ఈ పత్రం ఆ నమూనాను పక్కకు పెడుతుంది అన్నారు. తెలంగాణలో ఎక్కడ ఒక బిడ్డ జన్మించినా, అవి ప్రపంచ ఆర్థిక కేంద్రానికి 180 నిమిషాలలోపు ఉంటాయి అన్నారు.మానవ మూలధనం: జర్మన్‌ మోడల్‌, భవనాలు దేశాలను నిర్మించవు, ప్రజలు అలా చేస్తారు. పరిశ్రమ నిరంతరం తమకు ఉద్యోగాలు ఉన్నాయని చెబుతుంది, కానీ మన యువతకు ఆ ప్రత్యేక నైపుణ్యాలు లేవు. ఈ పత్రం ఒక సమూల మార్పును ప్రతిపాదిస్తోంది అన్నారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ విశ్వవిద్యాలయంతో, మేము జర్మన్‌ డ్యూయల్‌`సిస్టమ్‌ ఆఫ్‌ అప్రెంటిస్‌షిప్‌ను అవలంబిస్తున్నాము అన్నారు . విద్యార్థులు తరగతి గదుల్లో కూర్చోవడం మాత్రమే కాదు వారు 3 నుండి 4 రోజులు షాప్‌ ఫ్లోర్‌లో మరియు 1 నుండి 2 రోజులు తరగతిలో గడుపుతారు. మేము ‘‘డిగ్రీలు’’ నుండి ‘‘కాంపిటెన్సీ’’కి మారుతున్నాము అని డిప్యూటీ సీఎం వివరించారు. ఇంకా, ఆరోగ్య ఖర్చును ఉూఆఖలో 8%కి పెంచడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఎందుకంటే అనారోగ్య శ్రామిక శక్తి 3 ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థను నిర్మించదు అన్నారు. ఈ పత్రం యొక్క ప్రధాన ఉద్దేశం కోటి మంది మహిళలను కోటీశ్వరులు గా మార్చడం. మేము స్వయం సహాయక బృందాలకు రుణాలు ఇవ్వడం మాత్రమే కాదుÑ మేము ఆ సంఘాలను కార్పొరేట్‌ సంస్థలుగా మారుస్తున్నాము అన్నారు. వారికి వ్యక్తిగత క్రెడిట్‌ స్కోర్‌లను అందించడానికి మేము వారి తిరిగి చెల్లింపు చరిత్రను డిజిటలైజ్‌ చేస్తున్నాము, మారుమూల గ్రామంలోని ఒక మహిళ బంజారా హిల్స్‌లోని వ్యాపారవేత్త లాగా మూలధనాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది అన్నారు. సబ్సిడీ ద్వారా కాకుండా, ఎంటర్‌ప్రైజ్‌ ద్వారా కోటి మంది మహిళలు లక్షాధికారులు కావాలని మేము కోరుకుంటున్నాము అన్నారు.2047 విజన్‌ డాక్యుమెంట్‌ పై చర్చించడానికి ప్రతిపక్ష సభ్యులను, నా సహచరులను ఆహ్వానిస్తున్నాను. విూరు ఆలోచన చేయండి, విశ్లేషించండి, మెరుగైన సూచనలు సలహాలు ఇవ్వండి అన్నారు. తాను గ్లోబల్‌ సమ్మిట్‌ లో చెప్పినట్టుగా ఇది ఒక స్థిరమైన ప్రభుత్వ ఉత్తర్వు కాదు, ఇది ఒక సజీవ వేదిక అన్నారు.2014లో, శ్రీమతి సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో, మనం రాజకీయ తెలంగాణ కలను సాకారం చేసుకున్నాము. 2024లో, సంపన్న తెలంగాణ కోసం మనం ఒప్పందంపై సంతకం చేద్దాం.ముందుకు సాగుదాం అన్నారు.

 

సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట
` సంస్థ ఆసుపత్రుల్లో మార్చి నాటికి డాక్టర్లు, సిబ్బంది ఖాళీల భరీ
` ్తసింగరేణి 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాత్‌ లాబ్‌ ప్రారంభిస్తాం
` అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన
హైదరాబాద్‌(జనంసాక్షి):సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో పెండిరగ్‌లో ఉన్న వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది పోస్టులను రాబోయే 2026 మార్చి నాటికి పూర్తిగా భర్తీ చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీలో సింగరేణి పై జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం 11 మంది కాంట్రాక్ట్‌ డాక్టర్లు పనిచేస్తున్నారని 32 మంది డాక్టర్ల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చామని త్వరలోనే ఆ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. 176 పారామెడికల్‌ సిబ్బంది అంతర్గత నియామకం ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడిరచారు. రామగుండంలో క్యాత్‌ లాబ్‌ నిర్మాణం పిపిపి మోడల్‌ లో చేపడుతున్నామని కాంట్రాక్ట్‌ అవార్డు కూడా పూర్తయిందని తెలిపారు 75 రోజుల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు సింగరేణి ఆసుపత్రుల్లో మందుల సౌకర్యం కల్పిస్తున్నామని, సిపిఆర్‌ఎంఎస్‌ పథకం అందుబాటులో ఉన్నదని వెల్లడిరచారు. రిటైర్డ్‌ ఉద్యోగులు 8 లక్షల వరకు మందులను తీసుకునే అవకాశం కూడా కల్పించామని చెప్పారు. టెర్మినల్‌ బెనిఫిట్స్‌ కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని ఖాళీ స్థలాల్లో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు ఇండ్ల నిర్మాణం కొరకు స్థల కేటాయింపు అంశాన్ని బోర్డులు మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సింగరేణి సంస్థని వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులపై అందరిపై ఉందన్నారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ సవాళ్ల మధ్య సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాల వల్ల రాష్ట్రంలోని బొగ్గు గనులను నేరుగా సింగరేణికి కేటాయించకుండా వేలం నిర్వహిస్తున్నారని, దీనివల్ల ప్రైవేట్‌ ఏజెన్సీలు రంగ ప్రవేశం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వేలం ప్రక్రియలో పాల్గొనకపోవడం వల్ల సింగరేణి కొన్ని గనులను కోల్పోయిందని, అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగరేణిని స్వయంగా వేలంలో పాల్గొనేలా ప్రోత్సహించి కొన్ని బొగ్గు బావులను దక్కించుకునేలా చేశామని వెల్లడిరచారు.?ప్రస్తుతం మార్కెట్లో సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గు ధర కంటే ప్రైవేట్‌ సంస్థలు తక్కువ ధరకే బొగ్గును సరఫరా చేస్తున్నాయని, వినియోగదారులు సహజంగానే తక్కువ ధర ఎక్కడ ఉంటే అక్కడ కొనుగోలు చేస్తారని భట్టి వివరించారు. ఈ పరిస్థితి సింగరేణి బొగ్గు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నదని అన్నారు. సింగరేణి మనుగడ, కార్మికుల సంక్షేమం కొరకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన పది రోజుల్లోగా సింగరేణి పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సంస్థ సీఎండీ, డైరెక్టర్లతో ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.?ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. కార్మికుల భద్రతకు భరోసా కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం లేదా సింగరేణి సంస్థపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా కేవలం బ్యాంకుల ద్వారానే కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని వెల్లడిరచారు. సింగరేణిలో విజయవంతంగా అమలు చేస్తున్న ఈ కోటి రూపాయల బీమా పథకాన్ని, అదే తరహాలో విద్యుత్‌ శాఖలోని డిస్కంలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

కాలుష్య నివారణక ఈవీ పాలసీ

` ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
` వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్ల పెంపునకు చర్యలు
` అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి):ఈవి వాహనాల బ్యాటరీల సామర్థ్యం పెంపునకు కంపెనీలు చర్యలు చేపట్టాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈవి పాలసీ కింద తయారీదారులు, డీలర్లతో భేటీ ఏర్పాటు చేశామని అన్నారు. ఈవి వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్ల సంఖ్య పెంపునకు చర్యలు ఉంటాయన్నారు. మంగళవారం శాసనసభలో పొన్నం మాట్లాడుతూ.. ఈవీ వాహనాల రాయితీ అమలుతో రూ.900 కోట్ల పన్ను నష్టం అని.. ఉద్యోగులు ఈవి వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం తగ్గింపు ఉంటుందని పొన్నం తెలియజేశారు. ఉద్యోగులకు 20 శాతం వరకు తగ్గించాలని కంపెనీలను కోరామని అన్నారు. ఎంఎన్‌ సి కంపెనీలు ఈవి వాహనాలు కొనుగోలు చేసేలా విధానం ఉంటుందని, పిఎం ఈ డ్రైవ్‌ కింద 575 ఆర్టిసి బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. కొత్తగా 200కు పైగా ఈవి బస్సులు వస్తున్నాయని, వరంగల్‌ లో 100, నిజామాబాద్‌ లో 50 బస్సులు వస్తున్నాయని పేర్కొన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను స్కాప్ర్‌ చేయాలని, స్కాప్ర్‌ పాలసీ కింద ప్రోత్సాహం ఇచ్చేలా జివో తీసుకువచ్చామని పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఈ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఈవీ పాలసీని తీసుకువచ్చామని, ఈ ఏడాది కాలంలో లక్ష ఈవీ వాహనాలు అమ్ముడయ్యాయని వెల్లడిరచారు.కాలుష్యం తగ్గాలంటే ఎలక్టిక్ర్‌ వాహనాల వినియోగం పెరగాలని భాజపా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. ఎలక్టిక్ర్‌ వాహనాలపై కేంద్రం సబ్సిడీ ఇస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా ఇస్తోందా? అని ప్రశ్నించారు. ఛార్జింగ్‌ స్టేషన్లు లేకపోవడంతో గ్రావిూణ ప్రాంతాల్లో ఈవీలను తక్కువగా వినియోగిస్తున్నారు. రాష్ట్రం మొత్తంపై ఆ తరహా వాహనాలు 70 వేలే నడుస్తున్నాయి. కాలుష్యం తగ్గాలంటే ఈ సంఖ్య పెరగాలి. రోడ్‌ ట్యాక్స్‌, వెహికిల్‌ ట్యాక్స్‌ మినహాయిస్తూ ప్రభుత్వం ప్రోత్సహించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఎలక్టిక్ర్‌ వాహనాలు వాడాలి. ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాలని వెంకట రమణారెడ్డి అన్నారు. ఎలక్టిక్ర్‌ వాహనాల విూద కేంద్రం సబ్సిడీ ఇస్తుంది.. తెలంగాణ ప్రభుత్వం ఎలక్టిక్ర్‌ వాహనాల విూద సబ్సిడీ ఇస్తుందా? కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. గ్రావిూణ ప్రాంతాల్లో 40శాతం మాత్రమే ఎలక్టిక్ర్‌ వాహనాల వినియోగం ఉందని తెలిపారు.ఛార్జింగ్‌ స్టేషన్లు లేకపోవడం వల్ల గ్రావిూణ ప్రాంతాల్లో ఎలక్టిక్ర్‌ వాహనాలను వాడటం లేదని.. తెలంగాణలో 70 వేల ఎలక్టిక్ర్‌ వాహనాలే నడుస్తున్నాయని వెల్లడిరచారు. పొల్యూషన్‌ తగ్గాలంటే ఎలక్టిక్ర్‌ వాహనాల వినియోగం పెరగాలి.. రోడ్‌ ట్యాక్స్‌, వెహికిల్‌ ట్యాక్స్‌ మినహాయిస్తూ.. ప్రోత్సహించాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఎలక్టిక్ర్‌ వాహనాలు వాడాలని తెలిపారు. ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాలని చెప్పారు. త్రీ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ ఎలక్టిక్ర్‌ వాహనాలపై ప్రమోట్‌ చేయాలని సిర్పూర్‌ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబు తెలిపారు. ‘హైదరాబాద్‌ను పొల్యూషన్‌ ఫ్రీ చేయాలంటే.. ఎలక్టిక్ర్‌ వాహనాలను వాడాలి.. ఎలక్టిక్ర్‌, సోలార్‌ ప్యానెల్‌ తో నడిచే వాహనాలను ప్రోత్సహించాలి.. ఎలక్టిక్ర్‌ వాహనాల వినియోగం పెరగాలంటే పెద్ద ఎత్తున సబ్సిడీలు కల్పించాలి.. పార్కింగ్‌ స్థలాల్లో ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలి.. ఇవీ పాలసీని తీసుకుని వస్తున్నందుకు ధన్యవాదాలు‘ అని ఎమ్మెల్యే వెల్లడిరచారు.హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా మార్చాలంటే ఈవీలను వాడాలని చెప్పారు. వినియోగం పెరిగేందుకు పెద్ద ఎత్తున సబ్సిడీలు కల్పించాలని.. పార్కింగ్‌ స్థలాల్లో ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈవీ పాలసీ తీసుకొస్తున్నందుకు ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.