10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు
తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడిరచింది. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య పాఠశాలలకు వర్తిస్తాయని పేర్కొంది. జనవరి 16వ తేదీన కనుమ రోజును పురస్కరించుకుని ఐచ్ఛిక సెలవు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కనుమ రోజున రైతులు తమ పండుగను ప్రత్యేకంగా చేసుకుంటారు. కనుమ రోజున ఉత్సవాలు, పండుగ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జనవరి 17వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులను తమ ఇళ్లకు తీసుకురావడానికి తల్లిదండ్రులు ప్లాన్ చేసుకుంటున్నారు.


