అమెరికాలో సిక్కు హత్య

వాషింగ్టన్‌: గురుద్వారా కాల్పుల ఘటన మరవకముందే అమెరికాలోని బిస్కాన్సిస్‌ రాష్ట్రంలో మరో సిక్కుహత్యకు గురయ్యారు. హత్యకు గురైన దల్బీర్‌సింగ్‌(56) మిల్వాకిలో ఓ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. బుదవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన దుకాణంలో ప్రవేశించి దల్వీర్‌ను తుపాకీతో బెదిరించారు. తాము తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. ఓ వ్యక్తి కాల్పులు జరిపాడని దల్వీర్‌ బంధువు జితేందర్‌సింగ్‌ తెలిపారు. ఈ కాల్పుల్లో దల్వీర్‌ మరణించారని చెప్పారు.