అమ్మాయి చేతి పై బ్లేడ్ తో దాడి చేసిన యువకుడు అరెస్టు
సికింద్రాబాద్ (జనం సాక్షి ): ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 24వ తేదీన యువతి ( 18 ) ప్రేమోన్మాది బ్లేడుతో అమ్మాయి చేయి పై దాడి చేసిన రంజిత్ ( 21 ) ను ఓయూ పోలీస్ లు అరెస్టు చేశారు. రంజిత్ కార్ స్పేర్ పార్ట్స్ సేల్స్ మెన్ గా పనిచేస్తుండగా అమ్మాయి మెడికల్ షాప్ లో ఫార్మసిస్ట్ గా పని చేస్తుంది.
నిందితుడు రంజిత్ బాధిత యువతి ని ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు .గత మూడు నెలలుగా రంజిత్ ను అమ్మాయి పట్టించుకోవడం లేదు. తనను కలువవద్దని అతనితో చెప్పింది. దీంతో అతను ఆగ్రహానికి గురయ్యాడు.ఈనెల 24న రాత్రి మాట్లాడుకుందాం అని చెప్పి యువతిని ఓయూ క్యాంపస్ లోకి రంజిత్ తీసుకువచ్చాడు.
తనతో ఎందుకు మాట్లాడవు అని తనను దూరం పెట్టడానికి కారణం ఏమని ఆమెను నిలదీశాడు .ఇద్దరి మధ్య మాట మాట పెరిగి అకస్మాత్తుగాబ్లేడ్ తో యువతిపై దాడి చేసి తన బైకును అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరిని కలవకుండా రోడ్ల వెంబడి తిరుగుతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం మానేరు హాస్టల్ వద్ద తన బైక్ తీసుకువెళ్లేందుకు రంజిత్ రావడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేయరు .