అరకు సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
అరకు : విశాఖ జిల్లా అరకు సమీపంలోని గోరాపూర్ వద్ద ఈ ఉదయం కిరండోల్ నుంచి విశాఖ వస్తున్న గూడ్స్‌రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు.