అరుణ కేసు నిందితుడు ఆత్మహత్యాయత్నం

పుణే: నల్లగొండ విద్యార్థిని అరుణ హత్య కేసు నిందితుడు శివకుమార్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. పుణే నుంచి హైదరాబాద్‌ తరలిస్తుండగా రైలు నుంచి దూకి శివకుమార్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని పుణేలోని ఆస్పత్రిలో చేర్పించి పోలీసులు చికిత్స చేయిస్తున్నారు.