అల్‌ఖైదా అబూ యాహ్వా అల్‌ లిబి మృతిని నిర్ధరించిన జనహరి

హాంకాంగ్‌: అల్‌ఖైదా నేత అమన్‌ అల్‌ జవహరి తమ ఉపనేత అబూ యాహ్వా అల్‌ లిబి మృతిని నిర్ధరించారు. జవహరి విడుదల చేసిన వీడియోలో ఈ విషయం వెల్లడైంది. 9/11 దాడుల వార్షికోత్సవం నాడే ఈ వీడియోను విడుదల చేయడం విశేషం. మూణ్నెల్ల తర్వాత జవహరి తొలిసారి విడుదల చేసిన ఈ వీడియో 42 నిమిషాల నిడివి కలిగి ఉంది. సంస్థ అంతర్జాతీయ కార్యకలాపాల వ్యూహకర్త అయిన లిబి మృతి అల్‌ఖైదాకు తీరని లోటే, వీరమరణం పొందిన లిబిపై అల్లా దయచూపిస్తాడు, అని జవహరి అదబిక్‌లో పేర్కొన్నారు. ఈ వీడియోను పలు జీహాదీ సంస్థలు సోమవారం పోస్ట్‌ చేశాయి.