అస్వస్థకు గురైన గని కార్మికులను పమర్శించిన జిఎస్ఆర్ ఫౌండేషన్ బృందంఅస్వస్థకు గురైన గని కార్మికులను పమర్శించిన జిఎస్ఆర్ ఫౌండేషన్ బృందం
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : గురువారం ప్రమాదవశాత్తు శ్రీరాంపూర్ లోని ఎస్ ఆర్ పీ3 గని లో గ్యాస్ లీక్ రవి, రజనీకాంత్ అను ఇద్దరు కార్మికులు అస్వస్థకు గురయ్యారన్న విషయాన్ని తెలుసుకొని ఏరియా హాస్పిటల్ రామకృష్ణాపూర్ కి వెళ్లి డాక్టర్ రాజా రమేష్ బాబు కార్మికులను పరామర్శించారు. జీ.ఎస్.ఆర్.ఫౌండేషన్ తరపున కార్మికుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అస్వస్థత కు గురైన కార్మికులకు ధైర్యాన్ని చెప్పి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాలు ఎప్పుడైనా ఎక్కడైనా జరగొచ్చు కానీ ప్రమాదాలు జరిగిన తర్వాత మనం ఏ విధంగా స్పందిస్తే మన ప్రాణానికి నష్టం లేకుండా ఉంటుందని ఆలోచించి ముందుకు వెళ్లాలని తెలిపారు. ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.