ఆంజనేయ స్వామి ఆలయం కు 50000 విరాళం

share on facebook
కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ కు ఘన సన్మానం
గొడుగొనిపల్లి ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ
దోమ నవంబర్ 24(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని గొడుగోనిపల్లి గ్రామంలో కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి  పర్యటించి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలు అంత సుఖ సంతోషాలతో అష్టా ఆయురోగ్యలతో ఉండాలని ఆకాంక్షించారు.అంజనేయ స్వామి ఆలయ  అభివృద్ధి కొరకై 50,000/- వేల రూపాయలు అందజేస్తానని గ్రామస్థులకు హమి ఇవ్వడం జరిగింది.  అనంతరం గ్రామస్థులు  నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆసరగా నిలుస్తూ , ఆలయాల నిర్మాణానికి విరాళాలు అందిస్తున్నటువంటి సేవలు మరువలేనివి అని కొనియాడుతూ గ్రామస్థులు కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి ని  ఘనంగా శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమృతమ్మ ఆంజనేయులు, ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి, జి దశరథ్ రెడ్డి, వార్డ్ మెంబెర్స్ భీమయ్య, జే నిరంజన్,ఎర్ర నర్సింహులు, బి రాములు జే యాదయ్య, చాపల గూడెం సర్పంచ్ లక్ష్మణ్, మాజీ సర్పంచ్ డాక్టర్ జానకి రామ్,మహిపాల్,పెంటయ్య, నరేష్, యువకులు , గ్రామస్థులు  పాల్గొన్నారు.

Other News

Comments are closed.