ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

share on facebook

హరిప్రియ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హరిప్రియ
టేకులపల్లి, మార్చి 18( జనం సాక్షి ):  మండలంలోని మంగలి తండా గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరి ప్రియ హరి సింగ్ నాయక్ శనివారం  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇల్లందు నియోజకవర్గంలో దైవ, శుభ కార్యాలలో తన సహకారం అందిస్తూ ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు,భక్తులు అభినందనలు తెలుపుతున్నారు. ఆలయ నిర్మాణ శంకుస్థాపన అనంతరం వేద పండితులతో వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంగలి తండా గ్రామ ప్రజలు ఎప్పటినుండో తమ ఊరికి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారన్నారని, నేటికి వారి కల సాకారం అయిందన్నారు. ఈ ఆలయ నిర్మాణంలో తన సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయన్నారు. నేడు వీరితో కలిసి నూతన ఆలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా శ్రీ రాముడు, ఆంజనేయస్వామి ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ప్రజలందరిపై  ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య రాదా, సర్పంచ్ బోడ సరిత, బేతంపూడి సొసైటీ అధ్యక్షులు లక్కిలేని సురేందర్,బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బొమ్మెర్ల  వరప్రసాద్,బోడ బాలు నాయక్, బానోతు రామానాయక్, బానోత్ కిషన్ నాయక్, బానోతు రవి, ఎంపీటీసీ బాలకృష్ణ, సులానగర్ ఉపసర్పంచ్  ఉండేటి బసవయ్య, గుగులోతు కృష్ణ, భర్మావత్ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.