ఆగ్రాలో ఘోర అగ్ని ప్రమాదం

ఆగ్రా: ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది సజీవ దహనమయ్యారు. ధానాసదర్‌  ప్రాంతంలోని సెవ్లాలో ఓ ఇంట్లో ఈ ఉదయం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు దంపతులతోపాటు ఆరుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఆగ్నిమాపక, అధికార సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.గ్యాస్‌ సిలిండర్‌ పేలుడుతోనే ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలియజేశారు.