ఆటో బోల్తా : 14 మందికి గాయాలు

మునగోడు : నల్లగొండ జిల్లా మునుగోడు శివారులో గురువారం ఉదయం ఆటో బోల్తా పడిన సంఘటనలో 14 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పత్తి తీసేందుకు చిట్యాల మండలం నేరడ నుంచి మునుగోడు మండలం చొల్లేరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలించారు.