ఆత్మ కమిటీ డైరెక్టర్ చౌహన్ ను సన్మానించిన కేహెచ్ ఆర్
శివ్వంపేట సెప్టెంబర్ 2 జనంసాక్షి : ఇటీవల
నర్సాపూర్ ఆత్మ కమిటీ డైరెక్టర్ గా నూతనంగా ఎన్నికైన శివ్వంపేట మండలంలోని భి క్యాతాండాకు చెందిన సూర్యం చౌహాన్ ను శుక్రవారం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, కె హెచ్ ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లూరి హనుమంతరావు శాలువాలతో సూర్యం చౌహాన్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కల్లూరి హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పనిచేసి, ఉద్యమంలో పాల్గొన్న గిరిజన నాయకుడు సూర్యం చౌహాన్ కు నర్సాపూర్ ఆత్మ కమిటీ డైరెక్టర్ పదవి రావడం ఆనందదాయకమన్నారు. మనకు దక్కిన పదవులకు వన్నె తెచ్చే విధంగా పనిచేసి అందరి మన్ననలు పొందాలని ఆయన సూచించారు. సన్మాన గ్రహీత సూర్యం చౌహాన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి అందరి మెప్పుపొందేదుకు నిత్యం కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.