ఆప్కాబ్ ఛైర్మన్ గా పిన్నమనేని!

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌ (ఆప్కాబ్‌) కొత్త అధ్యక్షునిగా కృష్ణా జిల్లాకు చెందిన పిన్నమనేని వెంకటేశ్వరరావు పేరు ఖరారైనట్లు సమాచారం. గతంలో ఉమ్మడిగా ఉన్న ఈ బ్యాంకును రెండుగా విభజించడంతో ఏపీ పాలకవర్గానికి ఎన్నిక అనివార్యమైంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు శుక్రవారం నామినేషన్ల దాఖలు కార్యక్రమం జరగనుంది. అధికార టీడీపీకి చెందిన పిన్నమనేనికి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్‌, వైసీపీలకు చెందిన డీసీసీబీ అధ్యక్షులు కూడా సుముఖత చూపడంతో ఎన్నిక ఏకగ్రీవం కానున్నట్లు తెలుస్తోంది.