ఆరుగురు తృణమూల్‌ మంత్రులు రాజీనామా

ఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌కి చెందిన ఆరుగురు కేంద్ర మంత్రులు ఈరోజు సాయంత్రం ప్రధానికి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. కాసేపటి క్రితమే ప్రధానితో భేటీ అయిన వారు రాజీనామా పత్రాలు సమర్పించారు. అక్కడినుంచి వారు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలవడానికి వెళ్లినట్లు సమాచారం.