ఆరుతడి పంటల సాగుపై అవగాహన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 : రబీలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు గాను మండలంలో 11 నుంచి గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయాధికారి రవీందర్‌ తెలిపారు. 11న అబ్బాపూర్‌, అభంగపట్నం, మహంతం గ్రామాల్లో, 12న మోకన్‌పల్లి, కమలాపూర్‌, నాడాపూర్‌, 13న జన్నెపల్లి, పొతంగల్‌, అనంతగిరి, 14న సిరన్‌పల్లి, బినోల, 15న నిజాంపూర్‌, లింగాపూర్‌, 17న నాళేశ్వర్‌, తుంగిని, 18న నందిగామ్‌, మద్దేపల్లి, 19న నాగేపూర్‌, కోస్లి, 20న నవీపేట, రాంపూర్‌,  ఫతేనగర్‌ గ్రామాల్లో  సదస్సులు నిర్వహిస్తామని, రైతులు సదస్సులకు హాజరై జయప్రదం చేయాలన్నారు.