ఆర్టీఓకు రెండు జనరేేటర్ల కేటాయింపు

ఖమ్మం, జనవరి 19 : జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాలకు అత్యధునికమైన రెండు జనరేేటర్లు కేటాయించారు. ప్రస్తుతం ఖమ్మంలోని కార్యాలయాల్లో గల జనరేేటర్‌ తరచుగా మరమ్మతులకు గురవుతోంది. ప్రస్తుత విద్యుత్‌ కోతల నేపథ్యంలో రవాణా శాఖ సేవలకు విపరీతమైన అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఆర్టీఓ సుందర్‌ చొరవ తీసుకొని ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు. ఖమ్మంతో పాటు అదనంగా కొత్తగూడెం కార్యాలయానికి జనరేేటర్లు కేటాయించారు.