ఆర్టీసీ ఛార్జీలు పెంచే యోచన లేదు : ఏకే ఖాన్‌

ఏలూరు అర్బన్‌ : ఆర్టీసీ ఛార్జీలను ఇప్పట్లో పెంచే ఆలోచనలు లేవని ఆర్టీసీ ఎండీ ఎండీ ఏకే  ఖాన్‌ స్పష్టం చేశారు. ఏలూరును సందర్శంచిన ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఆర్టీసీ కొనుగోలు చేసే డీజల్‌ ధర లీటర్‌కు రూ.11.29 పైసలు పెరిగిన  నేపథ్యంలో ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నట్లు ఆయన తెలిపారు.