ఆర్టీసీ బస్సు- లారీ ఢీ, 15 మందికి గాయాలు

గుంటూరు: జిల్లాలోని మెదికొండూరు మండలం జంగన్‌ గుంట్లపాలెం వద్ద సోమవారం అర్థరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో 15 గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా వచ్చి ఢికొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా  ఉన్నట్లు సమాచారం.