ఆలంపూర్‌ వద్ద ఉద్రిక్తత

ఆలంపూర్‌ : సడక్‌ బంద్‌ సందర్భంగా ఆలంపూర్‌ టోల్‌ప్లాజా వద్ద తెరాస నాయకులు గందరగోళం సృష్టించారు. పలు వాహనాలకు టైర్లలో గాలి తీశారు. తెరాస ఎమ్మెల్యేలు ఈటెల, జూలపల్లి అరెస్టుకు నిరసనగా వారు ఆందోళనకు దిగారు. రాళ్లు రువ్వడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు భారీగా బలగాలను మోహరించినప్పటికీ తెరాస నాయకులు, కార్యకర్తలు రహదారిపైకి వచ్చిన నిరసన తెలిపారు.