ఆస్తి కోసమే లైలా,కుటుంబాన్ని హతమార్చా

ముంబయి:బాలీవుడ్‌ నటి లైలాఖాన్‌ హత్యకేసులో పర్వేజ్‌ తక్‌ వెల్లడించారు.అస్తి కోసమే బాలీవుడ్‌ నటి లైలాఖాన్‌ సహ కుటుంబ సభ్యులను హతమార్చినట్లు నిందితుడు పర్వేజ్‌ తక్‌ వెల్లడించారు.లైలా తల్లి ఇగాత్‌పురిలో ఉన్న ఫాంహౌన్‌ను తన రెండో భర్త అసిఫ్‌ షేక్‌కు కట్టబెట్లాలని నిర్ణయించడంతో కుటుంబ సభ్యులందరినీ చంపినట్లు విచారణ అధికారుల ముందు అంగీకరించాడు.లైలా తల్లి షెలీనాకు తక్‌ మాడో భర్త జమ్మూకాశ్మీరులో అటవీ గుత్తేదారైన తక్‌కు లష్కరేతోయిబాతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.షెలీనా,షేక్‌ల మద్య బందం బలపడడం తనకు ఆగ్రహం కలిగించిదని తక్‌ విచారణాధికారులకు తెలిపాడు.ఈ నేపధ్యంలో గతేడాది సెలవుల్లో ఇగాత్‌పురిలోని తమ షాంహౌస్‌కు వెళ్లిన లైలాఖాన్‌ కుటుంబాన్ని హతమార్చినట్లు వెల్లడించారు.షెలీనా హత్యను చూశారు కాబట్టే లైలా సహ ఇతరు కుటుంబ సభ్యులను హత్య చేసినట్లు వివరించాడు.నాసిక్‌ జిల్లా ఇగాత్‌పురిలోని పాంహౌస్‌లో పోలీసులు మంగళవారం ఆరు అస్థిపంజరాలను కనుగొన్నారు.