ఇంటర్‌సిటీకి తప్పిన పెనుముప్పు

హైదరాబాద్‌ : ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం స్వల్ప అగ్నిప్రమాదానికి గురైంది. ఉదయం సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన ఈ రైలులోని డి1 బోగీలోని కొన్ని ఫాన్ల నుంచి మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై గొలుసు లాగి బండిని ఆపారు. సమాచారం అందుకున్న రైల్వేశాఖ అధికారులు సాంకేతిక నిపుణులతో వచ్చి తనిఖీలు నిర్వహించారు. దీంతో చర్లపల్లి వద్ద సుమారు 25 నిమిషాల పాటు ఈ ఎక్స్‌ప్రెస్‌ను ఆపారు. తనిఖీలు పూర్తయిన తర్వాత ఈ రైలు పరుగులు తీసింది.