ఇదొక మరపురాని ఘట్టం :అమితాబచ్చన్‌

న్యూఢిల్లీ, జూలై 27 : క్రీడాజ్యోతిని అందుకోవడం జీవితంలో మరుపురాని ఘట్టం అని అమితాబ్‌బచ్చన్‌ శుక్రవారంనాడు మీడియాతో అన్నారు. ఇదంతా తన పూర్వ జన్మ సుకృతమని వినయంగా అన్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఒకవైపు ఈలలు, మరోవైపు అభిమానుల చప్పట్లు, కేరింతలు మధ్య ఒలింపిక్‌ జ్యోతి చేతబూని బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ఇక్కడ సౌత్‌ వార్క్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అక్కడున్న అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. ఈ మెగా ఈవెంట్‌ ఆరంభానికి ముందు రోజు జరిగిన రిలే కార్యక్రమంలో కూడా బిగ్‌ బి భాగస్వామి అయ్యారు. తెల్లని స్పోర్టింగ్‌ ట్రాక్‌లో మెరిసిన 69 ఏళ్ల బిగ్‌ బిని అభిమానులు ప్రోత్సహించారు. 300 మీటర్ల దూరాన్ని కొద్దిసేపు పరిగెత్తుతూ.. మరికొద్దిసేపు నడుస్తూ అందరికీ అభివాదం చేస్తూ ముగించారు క్రీడా జ్యోతి పర్యటన గురువారం నాడు 69 రోజుల తన పర్యటనను పూర్తి చేసుకున్న క్రీడా జ్యోతి 69 సంవత్సరాల వయసున్న అమితాబ్‌ చేతిలోకి రావడం విశేషం. ఇటీవలే అమితాబ్‌కు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఐక్య రాజ్య సమితి (ఐరాన) ప్రధాన కార్యదర్శి బాస్‌కీమూస్‌,పారిశ్రామికవేత్త లక్ష్మీమిట్టల్‌ పాల్గొన్నారు.ఈ విషయాన్ని అమితాబ్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.