ఇద్దరు దొంగల అరెస్ట్
కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి): కామారెడ్డి రూరల్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవునిపల్లి ఎస్ఐ రవికుమార్ తమ పోలీస్ సిబ్బందితో టేక్రియాల్ గ్రామం వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా అనుమానం వచ్చి పోలీస్ సిబ్బందితో పట్టుకున్నామని, వారిద్దరు టెక్రియాల్ గ్రామానికి చెందిన ఆలవుల సతీష్, సుధాకర్ అని తెలిపారు. అయితే వారిద్దరిని విచారించగా తిమ్మక్‌పల్లి గ్రామ శివారులో చెక్కరని రాజేశ్వర్‌కు చెందిన 80 వేల 800 రూపాయలు ఉన్న బ్యాగును దొంగిలించిన విషయం ఒప్పుకున్నారన్నారు. ఈ ఘటనపై కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావే:లో కామారెడ్డి డీఎస్పీ సోమనాథం విూడియాతో మాట్లాడుతూ చిన్నమల్లారెడ్డి గ్రామంలోని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు అనుమానాస్పదంగా ఎవరైనా కనబడిన 100 నంబర్‌కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించి రెరడు రోజుల్లో చేధించిన కామారెడ్డి రూరల్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, దేవునిపల్లి ఎస్ఐ రవికుమార్, పిఎస్ఐ రోహిత్, పి.సీలు రామస్వామి, మురళి, విశ్వనాధ్, బాలరాజ్, లక్ష్మణ్, నరేష్‌లను కామారెడ్డి డీఎస్పీ సోమనాథం అభినందించారు.