ఇరాక్‌లో కారు బాంబు పేలి 29మంది దుర్మరణం

ఇరాక్‌: ఇరాక్‌ మళ్ళీ బాంబుల మోతలతో మరోసారి దద్దరిల్లీంది. ఇరాక్‌లోని దివానియా ప్రాంతంలో కారు బాంబు పేలటంతో 25మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 50మందికి తీవ్ర గాయలయినాయి. కర్బాల ప్రాంతంలో బాంబు పేలి షియా భక్తులు నలుగురు మరణించగ 29మంది గాయపడినారు. గాయపడిన వారిని అధికారులు సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.