ఈశాన్య రాష్ట్రవాసులకు కమిషనర్‌ భరోసా

హైదరాబాద్‌: నగరం నుంచి ఖాళీ చేయాలన్న బెదిరింపులపై ఈశాన్య రాష్ల్రాల ప్రతినిధుల బృందం కమిషనర్‌ను కలిసింది. ఈశాన్య రాష్ట్రాలనుంచి ఇక్కడికి వచ్చి నివసిస్తున్నవారి భద్రతపై కమిషనర్‌ ఆనురాగ్‌ శర్మ వారికి భరోసా ఇచ్చారు. బెదిరింపులు వస్తే ఈ నెంబర్లకు ఫోన్‌ చేయాలని సైబరాబాద్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఫోన్‌ నెబర్లు 040-23261166, 9490617100, 9490617370.