ఈ నెల 25న కరీంనగర్‌కు క్రిష్ణయ్య రాక

కరీంనగర్‌: ఎపీఎస్‌ ఆర్‌టీసీ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన భహిరంగా సభకు ముఖ్యఅతిధిగా  బీసీ సంక్షమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  క్రిష్ణయ్య హజరుకానున్నారు.   భహిరంగాసభ ఈ నెల 25న మధ్యహ్నం 2గంటలకు ఉంటుందని ఎపీఎస్‌ఆర్‌టీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రీజినల్‌ అధ్యక్షుడు వంగ,వెంకటేశ్వర్లు తెలిపినారు. కరీంనగర్‌ ప్రెస్‌ క్లబ్‌లో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో రవాణ సౌకర్యం ఆర్టీసీ ప్రధాన భూమిక పోషిస్తుందని, బడుగు బలహీన వర్గాల  ప్రయాణా సౌకర్యర్ధం సంస్థనపు కాపాడుకుందామని బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి ఆర్‌,క్రిష్ణయ్య నాయకత్వంలో ఆర్టీసీ బీసీ కార్మికుల హక్కులు సాధించుకుందామని హక్కుల సాధనలో బడుగు బలహీన వర్గాలకు పోరాటం తప్పదని అందుకే రేపు జరగబోయే భహిరంగసభను అన్ని వర్గాల ప్రజలు కార్మి, కర్షకులు భహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్యదర్శి చామనపల్లి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు ఎమ్మెస్‌ నారాయణ, సహయక కార్యదర్శి ఎ.వి సాగర్‌, కోశాధికారి బీ.కాలిదాస్‌, పి తిరుపతి ప్రభకర్‌లు పాల్గొన్నారు.