ఈ నెల 25న ధర్మానను కోర్టుకు హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్థుల కేసులో వాన్‌పిక్‌ ఛార్జిషీటును సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 25న కోర్టుకు హాజరుకావలని ఆదేశిస్తూ ధర్మానకు నోటిసులు జారీ చేసింది. ప్రాసిక్యూషన్‌కు అనుమతి లేని కారణంగా ధర్మాన, మోపిదేవిలపై అవినీతి నిరోధక చట్టం అభియోగాలను కోర్టు పక్కన పెట్టింది. ఐఏఎస్‌ అధికారులు మన్మోహన్‌సింగ్‌, శామ్యూల్‌లపై ఐపీసీ అభియోగాలను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 25న హాజరు కావాలని వీరికి నోటిసులు జారీ చేసింది.