ఈ నెల 6 నుంచి కొత్త రైళ్లు

సికింద్రాబాద్‌: ఈ నెల 6 నుంచి కొత్తగా నాలుగు రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. బెల్లంపెల్లి-హైదరాబాద్‌ ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్‌, దర్బాంగా-సికింద్రాబాద్‌ల మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు , ఆజ్మీరా-హైదరాబాద్‌ మధ్య వారంలో ఒక సారి తిరిగే రైలు, తొమ్మిదో తేది నుంచి సికింద్రాబాద్‌-విశాఖ-సికింద్రాబాద్‌ ట్రైవీక్లీ దూరంతో రైలును ప్రవేశపెట్టానున్నట్లు  దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలియజేశారు.