ఈ రోజు పీసీసీ సమన్వయ కమిటీ భేటీ

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిని సమీక్షించేందుకు  పీసీసీ సమన్వయకమిటీ ఈ రోజు సాయంత్ర సమావేశం కానుంది. కమిటీకి నేతృత్వ వహించవలసిన గులాంనబీ ఆజాద్‌ విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన సమావేశానికి హాజరుకావడంలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, డిప్యూటి సీఎం దామోదర రాజనర్సింహ, చిరంజీవి, షబ్బీర్‌అలీ తదితరులు సమావేశానికి హాజరుకానున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై కూడా వారు చర్చించనున్నారు.