ఉండవల్లి వ్యాఖ్యలపై సీపీఐ మండిపాటు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపీ ఉండవల్లి వ్యాఖ్యలపై సీపీఐ తీవ్రంగా మండిపడింది. తెలంగాణా ప్రజలు రజాకార్లుగా వ్యవహరిస్తున్నారనే మాటలు కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు కూడా వర్తిస్తుందని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం సరికాదని, మాటలను నియంత్రించుకోవాలని ఉండవల్లికి సూచించారు.