ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
హుజూర్ నగర్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలో గౌట్ హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు రవీందర్ రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. శుక్రవారం పట్టణ పరిధిలోని ఎంపిడిఓ కార్యాలయంలో నందు ఎంపీపీ గూడెపు శ్రీను ఆధ్వర్యంలో జెడ్పీటీసీ సైదిరెడ్డి, ఎంపిడిఓ శాంత కుమారి, ఎంఈఓ సైదా నాయక్ లు ఘనంగా సన్మానించారు. అనంతరం పి ఈ టీ రవీందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఇలాంటి సన్మానం పొందడం ఎంతో ఆనందదాయకమని, ఈ సన్మానం పాఠశాల విధుల పట్ల మరింత బాధ్యత పెంచిందని, దానికి అనుగుణంగా మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ మాట్లాడుతూ మండలంలో మంచిగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని ఇలాంటి గుర్తింపు పొందడం మండలానికి గర్వకారణం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బీరెల్లి శ్రీనివాస్ రెడ్డి, నలబోలు శ్రీనివాస్ రెడ్డి, రాధాదుర్గా, మల్లెల ఉదయ శ్రీ, సంఘ నాయకులు వేముల శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి,
వెంకటేశ్వర్లు, రామకృష్ణ, మండల ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.