ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నాం: జీవన్‌రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో జీవన్‌రెడ్డి మాట్లాడారు. నిరుద్యోగులకు అన్యాయం జరగనివ్వం. అన్ని వర్గాల వారికి తమ ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుండు సున్న వస్తదని పేర్కొన్నారు. సభలో జానారెడ్డి వ్యవహరిస్తున్న తీరును జీవన్‌రెడ్డి తప్పుబట్టారు.