ఉధృతంగా ప్రవహిస్తున్న శబరి, పీలేరు నదులు

ఖమ్మం: జిల్లాలో గోదావరి ఉపనదులు శబరి, పీలేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నదులు పొంగిపొర్లడంతో వీఆర్‌పురం, కూనవరం మండలాల్లోని పలు గ్రామాలు మునిగిపోయినట్లు సమాచారం. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నరు.