ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అన్సారీ నామినేషన్‌ దాఖలు

న్యూఢిల్లీ: యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమీదఅన్సారీ నామినేషన్‌ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను  ఆయన…. రిటర్నింగ్‌ అధికారి అయిన లోక్‌సభ కార్యదర్శి విశ్వనాథన్‌కు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ములాయంసింగ్‌ యాదవ్‌, మాయావతి, లూలూప్రసాద్‌యాదవ్‌ తదితరులు హాజరయ్యారు. ఆగష్టు 7న ఉప రాష్ట్రపతి  ఎన్నికలు జరగనున్నాయి.