ఉపాధి హామీ పనుల ప్రారంభం,
కూలీలకు అన్ని వసతులు కల్పించాలి,
శ్రమకు తగిన ఫలితం లభించాలి,
సకాలంలో కూలీ డబ్బులను చెల్లించాలి,
నేషనల్ హ్యూమన్ రైట్స్ పెద్దవంగర మండల చైర్మన్ కుమ్మరి రామ్మూర్తి,
పెద్దవంగర మర్చి 16(జనం సాక్షి )ఉపాధి హామీ పనులను నేషనల్ హ్యూమన్ రైట్స్ కుమ్మరి రామ్మూర్తి ప్రారంభించారు, గురువారం రోజున మండలంలోని వడ్డేకొత్తపల్లి గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పనులను ఫీల్డ్ అసిస్టెంట్ ఎనగందుల హరీష్ తో కలిసి ఎన్ హెచ్ ఆర్ పెద్దవంగర మండల చైర్మన్ కుమ్మరి రామ్మూర్తి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు, ఈ సందర్భంగా చైర్మన్ రామ్మూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధిని కల్పిస్తూ, ఆర్థిక వెసులుబాటును కల్పించడం కోసం వెనుకబడిన ప్రజలకు పనిని కల్పించడం చాలా సంతోషకరమని, ఉపాధి కూలీల కోసం ఏర్పరచుకున్నటువంటి హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని చెప్పకనే చెప్పడం జరిగింది, ఉపాధి కూలీలకు సమయానికి కూలి డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, చాలీచాలని కూలీరేట్లతో ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని,కూలీ లు వేసవికాలం దృష్ట్యా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా పని చేసుకుని వెళ్లాలని సూచించారు, ప్రతి ఒక్క కూలి సరిపడ వేతనం వచ్చే విధంగా పని చేసుకోవాలని సూచించారు, ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కూలీలకు గడ్డపార,నీడ కోసం పట్టాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందించేవారు, ప్రభుత్వాలు ఇప్పుడుఎందుకు విస్మరించాయని ప్రశ్నించారు, కాబట్టి ప్రభుత్వాలు కూలీలకు అన్ని రకాల వసతులను కల్పించాలని కోరారు, ఈ కార్యక్రమంలో సీనియర్ మేటు వల్లపు సంతోష్ కుమార్, బారాజు రాజు, పాక లింగయ్య, సింగిటపు అహల్య, బొల్లు కేతమ్మ, కుమ్మరి అనూష, పాక మమత, బారాజు శ్రీలత, అరుణ, లింగమ్మ, ఉప్పమ్మ, ఇందిరమ్మ, రజిత తదితరులు పాల్గొన్నారు.