ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన
జనంసాక్షి, వంగూర్:
ఉద్యోగ ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ తర్వాత వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటున్న పెన్షన్ రద్దుచేసి నూతన కంట్రిబ్యూటరి పెన్షన్ స్కీం తీసుక రావడం వల్ల ఉద్యోగి జీవిత చివరి అంకంలో మరణ శాసనంగా మారుతుందని యూటీఎఫ్ రాష్ట్రనాయకులు చిన్నయ్య అన్నారు .అందుకే సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి ఓపి ఎస్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గురువారం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది, కావున పాలక ప్రభుత్వాలు వెంటనే స్పందించి కొత్తగా తీసుకువచ్చిన లోప భూయిష్టమైన కంట్రిబ్యూటరి పెన్షన్ స్కీం రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు చిన్నయ్య కోరారు. ఈరోజు మండల వ్యాప్తంగా వివిధ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా నాయకులు కె లింగమయ్య, మండల కమిటీ అధ్యక్షులు జంగయ్య, ప్రధాన కార్యదర్శి తిర్మలేశ్, సీనియర్ నాయకులు పర్శురాములు, శ్యామలయ్య, రాజనరేందర్ రావు, నర్సింహ్మ, బక్కయ్య, ప్రశాంత్, రాధిక, టీచర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.