ఎంజీఎంలో అత్యవసర వైద్యం అందక ఇద్దరి మృతి

వరంగల్‌: ఎంజీఎంలో జూడాల సమ్మె మూడో రోజూ కొనసాగుతోంది. ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్లు అత్యవసర సేవలు నిలిపివేయడంతో చికిత్స అందక ఇద్దరు మహిళలు మృతి చెందారు. దీంతో మృతుల బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. మరోవైపు తమ సమస్యలు పరిష్కరించకపోతే జూడాలు సమ్మెను ఉద్థృతం చేస్తామని హెచ్చరించారు.