ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటును రాజకీయం చేయుద్దు: నామా

న్యూఢిల్లీ: ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటును రాజకీయం చేయవద్దని తెలుగుదేశం పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. వైఎస్‌ హయాంలో పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఒక్క పథకానికైనా ఎన్టీఆర్‌ పేరు ఎందుకు ప్రతిపాదాంచడం లేదని ప్రశ్నించిన ఆయన చిత్తశుద్ది ఉంటే శాంషాబాద్‌ విమానాశ్రయానికి ఎన్టీఆర్‌ పేరును పెట్టించాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌డీఐలను తొలి నుంచి తెదేపా వ్యతిరేకిస్తోందని ఆయన పేర్కొన్నారు.