ఎన్టీపీసీలో విద్యుత్తు ఉత్పత్తికి ఆటాంకం

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీలో ఏర్పాడ్డ సాంకేతిక లోపంతో బుధవారం ఆరవ యూనిట్‌లో విద్యుత్తు  నిలిచిపోయింది. ఆరవ యూనిట్‌లోని బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కావడంతో 500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి  నిలిచిపోయింది. 200 మెగావాట్ల  రెండో యూనిట్‌లోనూ  ఈ ఉదయమే  విద్యుద్యుత్పత్తి నిలిచిపోయింది. ఈ రెండు యూనిట్లలోనూ అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు.