ఎన్టీపీసీలో విద్యుత్తు ఉత్పత్తికి ఆటాంకం
గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీలో ఏర్పాడ్డ సాంకేతిక లోపంతో బుధవారం ఆరవ యూనిట్లో విద్యుత్తు నిలిచిపోయింది. ఆరవ యూనిట్లోని బాయిలర్ ట్యూబ్ లీకేజీ కావడంతో 500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. 200 మెగావాట్ల రెండో యూనిట్లోనూ ఈ ఉదయమే విద్యుద్యుత్పత్తి నిలిచిపోయింది. ఈ రెండు యూనిట్లలోనూ అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు.