ఎన్నికల కమిషన్ నుంచి ఎసిబి లేఖ 

హైదరాబాద్: ఎన్నికల కమిషన్ ఎసిబి లేఖ రాసింది. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో విచారణ కొనసాగించాలని ఎన్నికల కమిషన్ లేఖలో పేర్కొంది. కేసు పూర్తి అయ్యేవరకు విచారణ కొనసాగించాలని తెలిపింది. లేఖ అందినట్లు ఎసిబి అధికారులు ధృవికరించారు. ఎన్నికల కమిషన్ లేఖతో కేసు కీలక మలుపు తిరిగింది. ఎసిబి ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. న్యాయనిపుణుల సలహాలను తీసుకోనున్నారు. కేసులో ఎవరెవరున్నారు., ఎవరెవరికీ నోటీసులు ఇవ్వాలన్న అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు స్టీఫెన్ సన్ వాంగ్మూలం రికార్డు కొనసాగుతోంది. రికార్డును సీల్డు కవర్ లో పెట్టి ఎసిబి కోర్టుకు సమర్పించనున్నారు.