ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలలో ఆలస్యం

ప్రభుత్వం కోసమే అన్న కాంగ్రెస్‌
న్యూఢిల్లీ,మార్చి5(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటనపై ఆలస్యం జరుగుతోందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ఎన్డీఏ ప్రయోజనాల కోసమే ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారా? అని ప్రశ్నించింది. గతంలోఈ పాటికే నోటిఫికేషన్‌ వచ్చిన విషయాన్‌ఇన గుర్తు చేసింది. గత లోక్‌సభ ఎన్నికల తేదీలపై మార్చి మొదటి వారంలో ప్రకటన వచ్చింది. ఈ విషయంపై ఈ సారి ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం కాకపోవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ అభ్యంతరాలు తెలిపారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అధికారిక పర్యటనలు ముగించే వరకు ఎదురుచూద్దామని ఎన్నికల సంఘం భావిస్తుందా? ఆయన ప్రచారం ముగిసిన తర్వాతే సార్వత్రిక ఎన్నికల ప్రకటన వస్తుందా?’ అని ప్రశ్నించారు.
‘రాజకీయ పార్టీల ప్రచార ర్యాలీల కోసం ప్రభుత్వ అధికారాన్ని వినియోగించుకోవద్దు. అలాగే, టీవీ, రేడియో, ప్రింట్‌ విూడియాలో పార్టీకి సంబంధించిన ప్రకటనలను ప్రభుత్వ విధుల్లో భాగంగా ఇవ్వకూడదు. ప్రజాధనాన్ని వినియోగించుకునేంతవరకు ఎన్డీఏకి ఎన్నికల సంఘం ప్రచారం చేసుకునే అవకాశం ఇచ్చేలా ఉంది’ అని అహ్మద్‌ పటేల్‌ విమర్శించారు. కాగా, ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే క్రమంలో ఈసీ పలు రాష్టాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను సవిూక్షిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో ఈసీ పర్యటిస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల సన్నద్ధతపై చర్చించింది.