ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం

` తక్షణం రద్దు చేయండి
` సుప్రీం కోర్టు సంచలన తీర్పు
` విరాళాలు ఇవ్వటం క్విడ్‌ ప్రోకోతో సమానం
` విరాళాల వివరాలను, దాతల పేర్లను వెల్లడిరచాల్సిందే
` దాతల పేర్లు పార్టీలు రహస్యంగా ఉంచటం తగదు
` ఎలక్షన్‌ బాండ్ల పేరుతో దొంగాటకు సుప్రీం చెక్‌
న్యూఢల్లీి(జనంసాక్షి): రాజకీయ పార్టీలకు ఎలక్షన్‌ బాండ్ల పేరుతో విరాళాలు ఇవ్వటం క్విడ్‌ ప్రోకో కిందకే వస్తుందని సుప్రీం కోర్టు కాసేపటి క్రితం సంచలన తీర్పునిచ్చింది. సదరు విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు రహస్యంగా ఉంచటం తగదని, 2019 నుంచి వచ్చిన ఆ విరాళాల వివరాలను, దాతల పేర్లను వెల్లడిరచాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఎలక్షన్‌ బాండ్లమీద దేశవ్యాప్తంగా మారోసారి చర్చ జరుగుతుతోంది. ఇంతకీ ఈ బాండ్లు ఏమిటి? వీటి నేపథ్యమేమిటో ఓసారి అవలోకిద్దాం. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల బాండ్లను తీసుకొచ్చింది. 2017 ఆర్థిక బిల్లు ద్వారా ఎలక్టోరల్‌ బాండ్లను ప్రవేశపెట్టారు. 2018లో ఇవి అమల్లోకి వచ్చాయి. నల్లధనం, అవినీతిని అరికట్టేందుకు.. రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు వీటిని తీసుకొచ్చామని అప్పట్లో చెప్పింది.బ్యాంక్‌ ద్వారా జారీ అయ్యే ఈ వడ్డీరహిత ఎన్నికల బాండ్లను డోనర్‌(దాత) కొనుగోలు చేస్తారు. చెక్కు లేదా డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా ఇది జరుగుతుంది. విరాళాలిచ్చేవారి రక్షణ కోసమే ఇది. ఈ గోప్యత పాటించకుంటే.. ప్రధానంగా డోనర్లు వాణిజ్యవేత్తలైన పక్షంలో రాజకీయ వివాదాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఆ బాండ్లను తనకు నచ్చిన పార్టీకి డోనర్‌ విరాళంగా అందజేస్తారు. ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీలు ఆ బాండ్లను 15 రోజుల్లోగా నగదుగా మార్చుకుని తీరాలి.రాజకీయ పార్టీలకు గతంలో దొడ్డిదోవ పద్ధతుల్లో విరాళాలు అందేవి. ఇది అవినీతి, నల్లధనానికి దారి తీస్తుందనే వాదన మొదలైంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎన్నికల బాండ్లు వచ్చాయి. అయితే ఈ పథకంలో కొన్ని నిబంధనలను గమనిస్తే.. పారదర్శకత నీటిమూటలాగే కనిపిస్తుంది. నగదు మూలాల గురించి డోనర్‌(వ్యక్తి/సంస్థ) వెల్లడిరచాల్సిన అవసరం లేదనేది ఓ నిబంధన. రాజకీయ పార్టీలు కూడా ఆ విరాళాలు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా కొనుగోలు చేసిన బాండ్లను డోనర్లు ఏ రాజకీయ పార్టీకి అందజేశారన్నవిషయం వారు వెల్లడిస్తే తప్ప బయట ప్రపంచానికి తెలియదు.తమ లాభనష్టాల నివేదికలో కంపెనీలు ఈ ఎన్నికల బాండ్లను చూపించనక్కర్లేదు. పైగా కార్పొరేట్‌ విరాళాలు 7.5% మించరాదన్న సూత్రం ఈ బాండ్ల విషయంలో వర్తించదు. అలాగే కంపెనీలు ఏవైనా 3 ఏళ్లుగా మనుగడలో ఉంటే.. రాజకీయ పార్టీలకు విరాళాలు అందజేసేందుకు అర్హత ఉన్నట్టే. డొల్ల కంపెనీలకు ఊతమిచ్చేందుకు ఇది పరోక్షంగా దోహదపడుతుందనేది సుస్పష్టం. నల్లధన ప్రవాహానికి ఇదో రాచమార్గంగా మారిందనేది అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) వాదన. ఎన్నికల బాండ్లను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఏడీఆర్‌ 2017లో పిటిషన్‌ వేసింది. 2019, 2021లలో బాండ్ల జారీపై స్టే కోరినా .. సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్బీఐ మాత్రమే బాండ్లను జారీ చేస్తుంది కాబట్టి.. కొనుగోలుదారుల వివరాలను తెలుసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీలు ఈ సమాచారాన్ని తమకు అనువుగా వినియోగించుకునే ప్రమాదమూ ఉంది. లెక్కలకు మించి ఆదాయం ఉన్న సంస్థలు/వ్యక్తులు బాండ్లను విరాళంగా అందజేసి.. అధికార పార్టీలను ప్రసన్నం చేసుకునే సౌలభ్యం ఈ పథకంలో ఉండటం గమనార్హం. బాండ్ల ద్వారా విరాళాలు అందుకోవడంలో అధికార పార్టీలదే అగ్రస్థానమనేది సుస్పష్టం. ఏడీఆర్‌ తన పిటిషన్లో ఎన్నో విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన ఆడిట్‌ నివేదికలు, ఆదాయపన్ను నివేదికలను పరిశీలిస్తే ఎన్నికల బాండ్లతో అధిక లబ్ధి చేకూరింది బీజేపీకేనని తెలుస్తోంది. ఏడీఆర్‌ నివేదిక మేరకు 2019-20లో బీజేపీ అత్యధిక మొత్తంలో(రూ.1651.022 కోట్లు) ఖర్చు చేసింది. కాంగ్రెస్‌(రూ.998.158 కోట్లు), టీఎంసీ(రూ.107.277కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆ ఏడాది రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న బాండ్ల విలువ రూ.3429.56 కోట్లు. ఆ మొత్తంలో నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు(బీజేపీ, కాంగ్రెస్‌, టీఎంసీ, ఎన్సీపీ) 87.29% మేర దక్కించుకున్నాయి. అనేక దేశాలు ఎన్నికల్లో బ్లాక్‌ మనీ ప్రభావాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని కేంద్రం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. భారత్‌ లో నల్లధనాన్ని అరికట్టడానికి డిజిటల్‌ పేమెంట్‌ విధానం అమలు చేస్తున్నామని తెలిపింది. 2.38 లక్షల డొల్ల కంపెనీలపై యాక్షన్‌ తీసుకున్నామని పేర్కొంది. వైట్‌ మనీ రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికి ఎన్నికల బాండ్ల పథకం ఉద్దేశమని చెప్పింది. అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రశ్నించారు. కారణమేంటని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన నిధులను ఎన్నికల సంఘం వద్ద ఉంచి.. అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయాలని సూచించారు. అప్పుడు అసలు విరాళాలే రావని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమాధానమిచ్చారు. ఈ పిటిషన్లపై కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ సమర్పించారు. ఎన్నికల బాండ్ల నిధుల మూలాలకు సమాచారం తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదని ఈ అఫిడవిట్‌ లో పేర్కొన్నారు.

ఏడీఆర్‌ నివేదిక మేరకు 2019-20లో ఎన్నికల బాండ్ల రూపంలో మొదటి మూడు పార్టీల ఖర్చులు
బీజేపీ రూ.1651.022 కోట్లు
కాంగ్రెస్‌ రూ.998.158 కోట్లు
టీఎంసీ రూ.107.277కోట్లు

 

నోటు కంటే ఓటు విలువైందని రుజువైంది
` సుప్రీం తీర్పుపై కాంగ్రెస్‌ హర్షం
న్యూఢల్లీి(జనంసాక్షి):రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై కాంగ్రెస్‌ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఈసీ తీరుపై విమర్శంచింది. ఈ విమర్వలకు రాహుల్‌ గాంధీ స్పందించారు. ఎన్నికల బాండ్లను మోదీ సర్కారు కమీషన్లకు మాధ్యమంగా మార్చేసిందని ఆయన అన్నారు. ఇది ఈ రోజు కోర్టులో రుజువైందన్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ట్విటర్‌లో స్పందిస్తూ.. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఎన్నికల బాండ్ల పథకం.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాకుండ, పార్టమెంట్‌ ఆమోదించిన రెండు చట్టాలను కూడా ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. నోట్ల కంటే ఓట్లకే ఎక్కువ శక్తి ఉంటుంది అనే వాస్తవాన్ని ఈ తీర్పు బలపర్చిందన్నారు. దీన్ని కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తుందన్నారు.చందాలిచ్చే దాతలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తు.. మోదీ ప్రభుత్వం అన్నదాతలకు పదే పదే అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. ఓటింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది నిజమైతే.. రాజకీయ పార్టీలతో సమావేశమయ్యే విషయంలో ఈసీ ఎందుకింత మొండితనంగా వ్యవహరిస్తుందని ఆయన ప్రశ్నించారు. వీవీప్యాట్ల సమస్యలపై రాజకీయ పార్టీలతో ఈసీ ఎందుకు సమావేశం కావడం లేదు అన్నారు. ఈ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని విశ్వాసిస్తునట్లు తెలిపారు.సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎన్నికల బాండ్ల పథకం సమాచార హక్కు, ఆదాయపు పన్ను చట్టాలను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. దీంతో ఇది క్విడ్‌ ప్రోకోకు దారితీసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే ఎన్నికల బాండ్ల జారీని ఎస్‌బీఐ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారి చేసింది.