ఎన్సీపీకీ పీఏ సంగ్మా రాజీనామా

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పీఏ సంగ్మా ఎస్‌సీపీకి రాజీనామా చేశారు. రాష్ట్రపతిగా పోటీచేస్తానన్న సంగ్మాను ఎస్‌సీపీ తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. పార్టీ నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.