ఎన్‌ఎంయూతో ఆర్టీసీ మూడో దఫా చర్చలు

హైదరాబాద్‌: సమ్మె నోటీసు ఇచ్చిన ఎన్‌ఎంయూతక్ష ఆర్టీసీ యాజమాన్యం మూడోదఫా చర్చలు జరిపింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసులు క్రమబద్దీకరించాలని యాజమాన్యాన్ని కోరినట్లు ఎన్‌ఎంయూ నేతలు తెలిపారు. 2, 900మంది డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసులను క్రమబద్దీకరించడానికి యాజమాన్యం అంగీకారం తెలిపిందని వారు చెప్పారు. మరికొందరి క్రమబద్దీకరణ విషయంలో యాజమాన్యం ప్రభుత్వంతో చర్చిస్తుందన్నారు. ఈనెల 19న యాజమాన్యంతో మరోమారు చర్చలు జరుపుతామని, చర్చల అనంతరం సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని ఎన్‌ఎంయూ నాగేశ్వరరావు తెలిపారు.