ఎన్‌ఎంయూ నేతలతో చర్చిస్తున్న ఏకే ఖాన్
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) నేతలతో ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ తుది దశ చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బస్‌భవన్‌లో జరుగుతున్నాయి. కార్మికుల పది డిమాండ్లపై ప్రతిష్టంభన నెలకొందని ఎన్‌ఎంయూ నేతలు గురవారం చెప్పిన విషయం తెలిసిందే. ఈ పది డిమాండ్లపై ప్రతిష్టంభన తొలగకపోతే సమ్మె విషయం ఆలోచిస్తామని తెలియజేశారు.