‘ఎఫ్‌డీఐ’లను అనుమతించబోం : కేరళ ముఖ్యమంత్రి
చెన్నై : చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ)లను తమ రాష్ట్రంలో అనుమతించబోమని కేరళ ముఖ్యమంత్రి ఉమన్‌చాందీ స్పష్టం చేశారు. నగరంలో తమ బంధువు ఒకరు మరణించడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం ఆయన చెన్నై వచ్చారు. ఆ సమయంలో విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రజలకు ఎఫ్‌డీఐలను అనుమతించడం రుచిందని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో భూమి లేని వారికి ఆగస్టు నుంచి ఉచితంగా అందిస్తామని ఆయన తెలియజేశారు. తద్వారా వామపక్షాల కంటే కాంగ్రెస్ పార్టీయే పేదలకు అండగా ఉంటుందనే విషయాన్ని నిరూపిస్తామని పేర్కొన్నారు.