ఎబీఎన్‌-ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలంగాణ ప్రజానికానికి క్షమపణ చెప్పాలి:టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌: ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలంగాణ ప్రజానికానికి క్షమపణ చెప్పాలని టీఆర్‌ఎస్‌ నేత వి.ప్రకాశ్‌ అన్నారు. గతంలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి తెలంగాణపై చేసిన విషప్రచారాన్ని కేంద్ర హోంశాఖ ఖండించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు ఆంధ్రజ్యోతి రాసే రాతలకు, ఏబీఎన్‌ కూతలకు ఆధారాలే ఉండవని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా సంస్థ తరపున రాధాకృష్ణ క్షమపణలు చెప్పాలని ప్రకాశ్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కేంద్ర,రాష్ట్రా ప్రభుత్వాలు సమైక్యంగా ఉండేందుకు మొగ్గు చూపుతుందని ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి చేసినా విషప్రచారాన్ని కేంద్ర హోంశాఖ ఖండించిన విషయం విదితమే.